రోసా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపునిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు పై ఏపి ఎన్జీఓ ల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎన్జీఓ హోమ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 103 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంఘాలకు గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స్టేట్ లెవెల్ కమిటీలో చర్చించాల్సిందేనని పేర్కొన్నారు. లేదంటే ఏపీ ఎన్జీఓ లు , జేఏసి లు కలసి ఈ అంశంపై తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఇదీ చూడండి: రివర్స్ టెండరింగ్... నోటిఫికేషన్ విడుదల