విజయవాడ చేరుకున్న నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్, మంత్రులు సుచరిత, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, మోపిదేవి వెంకటరమణ, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్, సీపీ సాదర స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆ తర్వాత గవర్నర్ ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకున్నారు. బిశ్వభూషణ్‌కు ఆలయ మర్యాదలతో మంత్రి వెల్లంపల్లి, దుర్గగుడి ఈవో, వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గగుడి అంతరాలయంలో హరిచందన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌కు వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు.
ఇదీ చదవండి : రాజభవన్లో ఏర్పాట్లు పూర్తి... రేపు ప్రమాణస్వీకారం