Degree convener Quota Seats: డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటా భర్తీపై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ నిబంధనను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్ చూస్తారనే నిబంధనపై న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన వెనుకబడిన వర్గాలైనా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకూ జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ ఏడాది అక్టోబరు 7న జీవో నెం.55 ను ప్రభుత్వం జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలు పొందిన వారికి జగనన్న విద్యాదీవెన వర్తించదని కూడా జీవోలో పొందుపరిచింది. ఈ ఉత్తర్వులపై ప్రజాప్రయోజన వాజ్యంతోపాటు రాయలసీమ డిగ్రీ కళాశాలల యాజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పిటిషనర్ తరపున న్యాయవాదులు ఎం. శ్రీ విజయ్, వేదుల వెంకటరమణ, వీరారెడ్డి వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి: 'ఆక్సిజన్ కొరతపై విపక్షాలు రాజకీయాలు మానుకోవాలి'