ETV Bharat / city

రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్​డెసివిర్​ కొరత లేదు

author img

By

Published : Apr 28, 2021, 7:00 PM IST

Updated : Apr 29, 2021, 5:58 AM IST

రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్​డెసివిర్​ కొరత లేదని ఉప ముఖ్యమంత్రి(వైద్యం) ఆళ్లనాని, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని.. వినియోగం కూడా ఇదే స్థాయిలో ఉందని ఆయన వెల్లడించారు. మరోవైపు రెమ్​డెసివిర్ ఇంజెక్షన్ల నిల్వలూ రోగుల కంటే అధికంగానే ఉన్నాయని చెప్పారు. ఔషధాల దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని
ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని

రాష్ట్రంలో ఆక్సిజన్‌కు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు కొరత లేదని ఉప ముఖ్యమంత్రి(వైద్యం) ఆళ్లనాని స్పష్టంచేశారు. మంగళగిరిలో బుధవారం మంత్రుల కమిటీ సమావేశంలో ఆళ్లనాని మాట్లాడుతూ... ‘‘కొవిడ్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్న వారికి ఆసుపత్రుల్లో, తక్కువగా ఉన్న వారికి కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చికిత్స అందిస్తాం. కేంద్రం నుంచి వస్తున్న ఆక్సిజన్‌ను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాం. టీకాలను అర్హులకు అందజేస్తున్నాం. ప్రభుత్వ నిఘా పెరగడంతోనే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులోనికి వస్తున్నాóు. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు చేస్తున్నారు. వారికి ఎలాంటి సమస్యలున్నా... పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం పకడ్బందీగా పనిచేస్తున్నా... తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి మాట్లాడాలి. విశాఖలో చిన్నారి మృతి ఘటనపై విచారణకు ఆదేశించాం. వైద్య సిబ్బంది తప్పుంటే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని వివరించారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, సుచరిత, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, అధికారులు పాల్గొన్నారు.

‘పడకల వివరాలపై పొంతన లేదేం’
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రుల్లో పడకలు, కొవిడ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు, నాణ్యమైన ఆహార సరఫరా తదితర అంశాలపై మంత్రుల కమిటీ ప్రధానంగా చర్చించింది. కాగితాలపై ఉండే పడకల ఖాళీల వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వివరాలకు పొంతన ఉండకపోవడం ప్రస్తావనకు వచ్చింది. అలాగే... నిరుడు కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది ప్రయోజనం పొందారు.. ఇప్పుడా పరిస్థితి ఎందుకు లేదనే అంశంపైనా చర్చించారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తే కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌, ఇతర నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న విషయం ప్రస్తావన రాగా దానికి అలాచేయడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమైంది.

కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఖాళీగా పడకలు

కొవిడ్‌ సంరక్షణ కేంద్రాల్లో వేల సంఖ్యలో పడకలు అందుబాటులో ఉన్నా... బాధితుల నుంచి స్పందన తక్కువైందని, ఇందుకు కారణాలను విశ్లేషిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. విజయవాడలో బుధవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో 33,427 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 4,703 మంది రోగులే చికిత్స పొందున్నారు. లక్షణాలు తక్కువగా ఉన్న వారికి ఈ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించి, చికిత్స అందిస్తున్నాం. అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి’ అని సింఘాల్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌లో ఖాళీల వివరాలు
‘‘ఆసుపత్రుల్లో పడకల ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటిని చూసుకుని ప్రజలు ఆసుపత్రులకు వచ్చి చేరవచ్చు. డేటా ఎంట్రీలో సమస్యలుంటే... గ్రామ/వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం’’ అని సింఘాల్‌ వివరించారు. ‘‘ప్రస్తుతం ఇళ్లలోనే 75,209 మంది చికిత్స పొందుతున్నారు. వీరికి వైద్యులు టెలి కన్సల్టెన్సీ ద్వారా సూచనలు, సలహాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.48%, మరణాల నమోదు 0.74 శాతంగా ఉంది. గత మూడు రోజుల్లో 30 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పైవేటు ఆసుపత్రులకు అందించాం. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలోనే 12 వేల ఇంజక్షన్లు ప్రైవేట్‌ ఆసుపత్రులకు సరఫరా చేశాం. అయినా ఇంజక్షన్లకు ఎందుకు కొరత వస్తోందో పరిశీలిస్తున్నాం. ఇంజిక్షన్లన్నా కొరత అని చెబితే నల్లబజారుకు తరలిపోతున్నట్లుగానే భావించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో 28,994 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి సరఫరా అయ్యే 423 టన్నుల ఆక్సిజన్‌కు తగ్గట్లుగానే వినియోగం ఉంది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ సంస్థల నుంచి అదనంగా 26 టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుంది. 104 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేస్తున్నాం. ఈ కాల్‌సెంటర్‌కు ప్రతిరోజూ 6-7 వేల వరకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి’ అని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వివరించారు.

ఇదీచదవండి: అమానుషం.. అనాథలా మృతదేహం..

Last Updated : Apr 29, 2021, 5:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.