గ్రూప్ 1 ప్రశ్నాపత్రం విషయంలో ఏపీపీఎస్సీ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ప్రశ్నాపత్రంలో 50కి పైగా తప్పులేమిటని ప్రశ్నించింది. ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేసే సామర్థ్యం లేదా.. నిపుణులేం చేస్తున్నారని నిలదీసింది. తప్పులున్న ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహించి ఏపీపీఎస్సీ విజయవంతం అయిందని వ్యాఖ్యానించింది. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు అప్పీళ్లపై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. 2018 డిసెంబర్‌లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. ఈ పరీక్ష పత్రంలో 51 తప్పులున్నాయంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీచదవండి