కియా పరిశ్రమ వద్ద నాలుగు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ కోసం 112.20 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. కియా వద్ద 22 ఎకరాల్లో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం ఏపీఐఐసీ తీసుకున్న 2 వేల కోట్ల రుణం నుంచి ఈ 112 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. తక్షణం దీనిపై కార్యాచరణ చేపట్టాల్సిందిగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్ ఉత్తర్వులు ఇచ్చారు.
- కడప ఉక్కు పరిశ్రమ బోర్డులో మార్పులు
కడప ఏపీ హై గ్రేడ్ స్టీల్ ప్లాంటు లిమిటెడ్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, ఉక్కు పరిశ్రమ ఎండీ బోర్డులో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: ఎయిర్ఏసియా పైలట్ల జీతాల్లో 40 శాతం కోత