దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల పురోగతిపై.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కడప- బెంగళూరు మధ్య 268 కిలోమీటర్ల పొడవున చేపట్టిన.. బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మాణ పనులపై ప్రధాని ఆరా తీశారు. దీనిపై ఏపీ, కర్ణాటక సీఎస్‌లు వివరాలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి జనఔషధి పరియోజన పథకంపైనా మోదీ సమీక్షించారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పౌర ఆస్పత్రుల్లో.. అద్దె లేని స్థలాలను కేటాయించాల్సిందిగా ఆదేశించారు. ఏపీ నుంచి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా.. సాధారణ పరిపాలనశాఖ, వైద్యారోగ్యశాఖ, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శులు అనిల్ కుమార్ సింఘాల్, ఎంటీ కృష్ణబాబు, శశిభూషణ్ కుమార్‌లు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: సీఎంగా ఉండటానికి జగన్‌రెడ్డి అనర్హుడు: చంద్రబాబు