AP BJP leaders on YSRCP ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక సంస్కృతిని తీసుకొస్తున్నారని మండిపడ్డారు.'ప్రజలు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అని రోడ్లపైకి వచ్చే దుస్థితి నెలకొందన్నారు. 'రైట్ టు రీకాల్' పరిస్థితి ఏపీలో వచ్చే అవకాశం ఉంది. ఎవరు బెదిరించినా కేసు పెట్టి ఆ వివరాలు మాకు పంపండి. కేంద్రం హోంశాఖను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరిస్తాం. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలో కూడా ఖరారు చేస్తాం' అని సుజనాచౌదరి తెలిపారు.
సొంత పార్టీ వాళ్ల దాడి అమానుషం: ఎంపీ జీవీఎల్
MP GVL fire on ysrcp: సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ వాళ్ల దాడి అమానుషం అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సుబ్బారావు గుప్తాపై దాడిని ఖండించిన ఆయన.. దాడికి పాల్పడిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని విమర్శించారు.
వాళ్లను ఉరివేయాలి: టీజీ వెంకటేశ్
MP TG Venkatesh on ycp: చంపుతానని బెదిరించే వారిని, తాగి వాహనం నడిపేవారిని ఉరివేయాలని ఎంపీ టీజీ వెంకటేశ్ కోరారు. ఒంగోలులో వైకాపా నేత సుబ్బారావుపై దాడిని ఆయన ఖండించారు. సుబ్బారావు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ఇదీ చదవండి..
Congress Executive Meeting: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'