ETV Bharat / city

ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ గుర్తింపు మా సంఘానికే ఉంది: కేఈ ప్రభాకర్ - ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్

ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ గుర్తింపు తమ సంఘానికే ఉందని ఆ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ స్పష్టంచేశారు. దీనిపై అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

andhra kabaddi association president ke prabhakar media meet
కేఈ ప్రభాకర్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు
author img

By

Published : Oct 12, 2020, 5:53 PM IST

ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ గుర్తింపు తమ సంఘానికే ఉందని అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నెల 10న అధికారికంగా ఆదేశాలు జారీ చేసి చెప్పిందని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏకేఎఫ్​ఐ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎస్పీ గార్గ్ జారీ చేసిన ఆర్డర్ కాపీను ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ విడుదల చేశారు.

తప్పుడు పద్ధతిలో కబడ్డీ అసోసియేషన్​ను యలమంచిలి శ్రీకాంత్ తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లగా.. ఈనెల 3న ఇరు వర్గాల సమక్షంలో జూమ్ యాప్ ద్వారా విచారణ నిర్వహించారన్నారు. వాదనల అనంతరం అధ్యక్షుడిగా వెంకటరెడ్డి, కార్యదర్శిగా శ్రీకాంత్ ఉన్న అసోసియేషన్​కు గుర్తింపు లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. యలమంచిలి శ్రీకాంత్ ఉద్దేశపూర్వకంగానే తమ సంఘంపై అనేక ఆరోపణలు చేశారని కేఈ ప్రభాకర్ విమర్శించారు. క్రీడాకారులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి..

'ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.