ETV Bharat / city

RASHMI GOWTHAM: విజయవాడలో సందడి చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ - విజయవాడ వార్తలు

విజయవాడ నగరంలో ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి వచ్చిన యాంకర్ రష్మీ.. ప్రేక్షకులను అలరిస్తూ సందడి చేశారు. కరోనా నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని..ప్రేక్షకులకు చేరువయ్యేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె అన్నారు.

RASHMI GOWTHAM
RASHMI GOWTHAM
author img

By

Published : Oct 12, 2021, 4:27 PM IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో విజయవాడకు రావడం చాలా సంతోషంగా ఉందని.. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నట్లు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్(ANCHOR RASHMI GOWTHAM) అన్నారు. విజయవాడలో ఎల్విన్ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమె అభిమానులతో కాసేపు సందడి చేశారు.

వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో అలరించిన యాంకర్ రష్మీ గౌతమ్

కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయని..ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అవి కుదుటపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమయంలో భారీ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి విజయవాడకు రావడం సంతోషకర విషయమన్నారు. ఓటీటీ, థియేటర్ ఏదైనా నటులు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే కోరుకుంటారన్నారు. కరోనా ప్రభావం సినిమా రంగంపై కూడా పడిందని..ఇపుడిప్పుడే థియేటర్​లలో సినిమాలు విడుదల అవుతున్నాయన్నారు. ప్రేక్షకులకు చేరువయ్యేందుకు వేదిక ఏదైనా ఒక్కటేనని..ప్రేక్షకులను అలరించడమే నటుల ప్రధాన లక్ష్యమన్నారు.

ఇదీ చదవండి:

Gorantla: 'జగనన్న చీకటి పథకం' అని పేరు పెట్టాల్సింది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.