ETV Bharat / city

కేటీఆర్ టాలీవుడ్ స్టార్ అవుతారన్న మహీంద్రా.. మీకు బ్రాండ్ అంబాసిడర్ అవుతానన్న మంత్రి..! - మహీంద్రా ట్రాక్టర్స్​

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు మహీంద్రా గ్రూప్​ సంస్థల చైర్మన్​ ఆనంద్​ మహీంద్రా సరదా ట్వీట్​ చేశారు. మీరు కెమెరా ముందుకొస్తే టాలీవుడ్​ లాగేసుకుంటుందంటూ పేర్కొన్నారు. మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్​ చేస్తానని కేటీఆర్​ కామెంట్​ చేశారు.

Anand Mahindra tweet on KTR
కేటీఆర్‌కు ఆనంద్‌ మహీంద్రా సరదా ట్వీట్‌
author img

By

Published : Jun 23, 2022, 8:10 AM IST

Updated : Jun 23, 2022, 9:25 AM IST

'మీరు కెమెరా ముందుకొస్తే టాలీవుడ్‌ లాగేసుకుంటుంద'ని.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సరదాగా ట్వీట్‌ చేశారు. జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను కేటీఆర్‌ బుధవారం సందర్శించి.. ట్రాక్టర్‌ నడిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో వెల్లడిస్తూ 'మహీంద్రాజీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్‌ చేసేందుకు నేను రెడీ. అందుకోసం మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిస్తా’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా వెంటనే స్పందించారు. ‘కేటీఆర్‌, మీరు తిరుగులేని బ్రాండ్‌ అంబాసిడర్‌ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్‌ మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుంది' అని ఆనంద్‌ చమత్కరించారు.

తెరాసలో కష్టపడే వారికి సముచిత గౌరవం: తెరాసలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పదవులపై ఆపేక్షతో కాకుండా పార్టీ కోసం కృషి చేసిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు. తెలంగాణ ఎఫ్‌డీసీ, రెడ్‌కోల ఛైర్మన్లుగా నియమితులైన అనిల్‌ కుర్మాచలం, సతీష్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. అంతకుమునుపు సతీష్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:

Last Updated : Jun 23, 2022, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.