ETV Bharat / city

'ఉపాధి హామీ కూలీలను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలం' - ఉపాధి హామీ కూలీలపై అనగాని కామెంట్స్

ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించి.., రోజువారీ కూలీ ఆరు వందలకు పెంచాలని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. కూలీలు కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చేందుకు ఖర్చుల నిమిత్తం రూ. 500 అందించాలన్నారు.

anagani satyaprasad comments on nregs workers
ఉపాధి హామీ కూలీలను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలం
author img

By

Published : Apr 25, 2021, 8:24 PM IST

anagani satyaprasad comments on nregs workers
అనగాని పత్రికా ప్రకటన

ఉపాధి హామీ కూలీలను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ కూలీలు పనులు చేస్తున్నారని..,వైరస్​తో చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ కూలీల శ్రమ వెలకట్టలేనిదని.., మండుటెండలోనూ పనులు చేస్తున్నారని కొనియాడారు. ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని అనగాని డిమాండ్‌ చేశారు. రోజువారీ కూలీ ఆరు వందలకు పెంచాలని.., పనిచేసే ప్రదేశాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధిహామీ కూలీలు వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చేందుకు ఖర్చుల నిమిత్తం రూ. 500 అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇదీచదవండి: పెరుగుతున్న చమురు ధరలు..చుక్కలు చూపిస్తున్న ఆటో ఛార్జీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.