కొవిడ్ సమయంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వం ఒక వైపు దశల వారిగా మద్యనిషేధం అని చెబుతూ కరోనా సమయంలో మద్యం విక్రయించడం సరి కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. మూడు రోజులుగా కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
మద్యం అమ్మకాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు సంబంధించిన కాపీని తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.