జమ్ము- కశ్మీర్ విభజన బిల్లుపై వాడీవేడిగా జరిగిన చర్చ సందర్బంగా.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విభజన అంశం చర్చనీయంశంగా మారింది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పై అమిత్‌షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర, తెలంగాణ విభజన ఎలా జరిగిందో గుర్తు చేసుకోండి అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సభ్యులను బయటకు పంపి,.. టీవీ ప్రసారాలు నిలిపి, తలుపులు మూసేసి బిల్లు ఆమోదించారని అమిత్‌షా అన్నారు.
దీనిపై స్పందించిన గులాంనబీ ఆజాద్... జమ్ము- కశ్మీర్ అంశంపై భాజపా ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. ఆంధ్ర-తెలంగాణ విభజన చేసే ముందు... ఏడాదిపాటు ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలతో 20 కంటే ఎక్కువసార్లు సమావేశమైనట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయాన్ని కేంద్రానికి వదిలిన తర్వాతే విభజన జరిగిందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి