ETV Bharat / city

CRDA: సీఆర్‌డీఏ పరిధిలో అభివృద్ధి ప్రణాళికల్లో సవరణలు

CRDA: సీఆర్‌డీఏ పరిధిలోని పలుచోట్ల భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. ఈ మేరకు ఆరు ప్రాంతాల జోనల్‌ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాలో చేసిన మార్పులను ఆమోదిస్తూ.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : May 1, 2022, 7:59 AM IST

Amendments to development plans under the CRDA
సీఆర్‌డీఏ పరిధిలో అభివృద్ధి ప్రణాళికల్లో సవరణలు

CRDA: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని పలుచోట్ల భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. ఈ మేరకు ఆరు ప్రాంతాల జోనల్‌ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాలో చేసిన మార్పులను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఏయే జోనల్‌ ప్రణాళికలో ఎలాంటి మార్పులకు ఆమోదం తెలిపారంటే..

  • తాడేపల్లి జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికలోని కొలనుకొండలో డోర్‌ నంబరు 6/1బీ, 1సీ, 7(పీ)లో 8,361.25 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని వ్యవసాయ ప్రాంతాన్ని నివాస అవసరాలకు వినియోగించేందుకు అనుమతించారు.
  • మంగళగిరి: ఆత్మకూరులో డోర్‌ నంబరు 393/2ఏ, 2బీలో 4,004.98 చ.మీ నివాస ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుమతి.
  • కానూరు: పోరంకిలో ఆర్‌ఎస్‌ నంబరు 453/1సీ (పీ), 453/1డీ (పీ), 453/1ఈ (పీ)లో 520.23 చ.మీ స్థలంలో ప్రజా అవసరాల కోసం ప్లానులో గుర్తించిన స్థలాన్ని నివాస అవసరాలకు వాడుకునేలా అనుమతించారు.
  • తెనాలి: జయప్రకాశ్‌నగర్‌ టౌన్‌ సర్వే నంబర్లు 647(పీ)లోని 616.84 చ.మీ స్థలాన్ని ప్రజావసరాల నుంచి నివాస అవసరాలకు మళ్లించారు.
  • గన్నవరం: ఆత్కూరులో ఆర్‌ఎస్‌ నంబరు 1/2(పీ)లోని 26,755.53 చ.మీ. స్థలాన్ని వ్యవసాయ ప్రాంతం నుంచి నివాస అవసరాలకు బదలాయించారు.
  • గొల్లపూడి: నివాస ప్రాంతంగా గుర్తించిన గొల్లపూడిలోని ఆర్‌ఎస్‌ నంబరు 495/2ఏ(పీ)లోని 994.54 చ.మీ విస్తీర్ణాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుమతి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.