ETV Bharat / city

ఆలివ్​ నూనెతో అందమైన కురులు!

సహజ నూనెల్లో ఆలివ్​ నూనె ఒకటి. దీన్ని వంటకాలతో పాటు సౌందర్య పోషణకూ వాడుతుంటారు. ఇంతకీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు అందూతాయో చూద్దామా!

amazing-benifits-of-olive-oil-for-hail-fall-and-damage
vamazing-benifits-of-olive-oil-for-hail-fall-and-damage
author img

By

Published : Sep 5, 2020, 3:07 PM IST

కారణాలేవైనా కొందరికి జుట్టురాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు పోషకాహారం తీసుకోవడంతో పాటు దానిపై కొంత శ్రద్ధ పెట్టాలి. ఆలివ్​ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మాడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు ఎదుగుదలకు దోహదపడుతాయి. వారానికి రెండు మూడు సార్లు ఆలివ్​నూనెని తలకు రాసుకుని కాసేపు మర్దన చేయండి. రక్తప్రసరణ వల్ల ఫాలికల్స్​ ఉత్తేజితమై రాలిన జుట్టు తిరిగి వస్తుంది.

  • ఆలివ్​ ఆయిల్​... జుట్టుకి తగిన తేమ అందిస్తుంది. చుండ్రుని అరికడుతుంది. దాంతో జుట్టు రాలడం అదుపులోకి వస్తుంది. ఆలివ్​, కొబ్బరినూనెల్ని సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టిస్తే మంచిది.
  • జుట్టు ఎండిపోయి పీచులా కనిపిస్తుంటే ఇలా చేయండి. నాలుగు టేబుల్​ స్పూన్ల ఆలివ్​ నూనెలో చెంచా బాదం నూనె, కొద్దిగా కర్పూరం కలిపి మాడు నుంచి చివరి వరకూ పట్టించండి. మృదువుగా మర్దన చేసి తలస్నానం చేయండి. వెంట్రుకలు చిట్లిపోకుండా ఉంటాయి. ఆరోగ్యంగా నిగనిగలాడుతాయి.

ఇవీ చూడండి:

వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది... కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.