పోలీసుల తీరుపై గవర్నర్‌కు అమరావతి మహిళా ఐకాస ఫిర్యాదు - గవర్నర్‌ను కలిసిన మహిళా ఐకాస నేతలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారంటూ అమరావతి మహిళా ఐకాస నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఈ విషయంలో స్పందించాలని వినతిపత్రం సమర్పించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న 2800 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని, మహిళలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు ఐకాస సభ్యులు తెలిపారు.