అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ ధర్నా చౌక్‌లో అమరావతి పరిరక్షణ సమితి నిరసన చేపట్టింది. ఈ ధర్నాలో క్రీడాకారులు, క్రీడా సంఘాలు, ప్రజా సంఘాలు , వైద్యులు పాల్గొన్నారు. 'మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు' అనే నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో తెదేపా మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. లక్షకోట్లు ఖర్చు అవుతుందని అవాస్తవాలు చెప్తూ... రాజధానిని తరలించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి