ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ఇంతియాజ్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపించరాదని... అవగాహనతోనే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటుందని కలెక్టర్ అన్నారు.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 20వేల మంది వరకు ఎయిడ్స్ వ్యాధి బాధితులు ఉన్నారన్నారు. వారికి వైద్య పరంగా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు పింఛన్ మంజూరు చేస్తోందన్నారు. ఎన్జీఓలు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని అజిత్ సింగ్ నగర్ పాయికాపురం ఎల్బీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. పాఠశాల నుంచి స్థానిక పైపుల రోడ్డు కూడలి వరకు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి నాగలింగేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: