అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా... అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని ఆ సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.
బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల వద్దనే నిరసనలు తెలపాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే విజయవాడ నుంచే త్వరలో రాష్ట్రస్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు.
ఇదీ చదవండి: