ETV Bharat / city

ఎస్​ఈసీ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఏజీ

author img

By

Published : May 30, 2020, 8:05 PM IST

Updated : May 31, 2020, 9:34 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను తాను పునర్నియమించుకునే అధికారం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కి లేదని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.సుబ్రహ్మణ్య శ్రీరాం తెలిపారు. అలా ఆయన స్వయంగా ప్రకటించుకోవడం చట్ట విరుద్ధమన్నారు. ఆయనను ఆ పోస్టులో మళ్లీ నియమించాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప, ఆయనంతట ఆయన వెళ్లి ఆ పోస్టులో కూర్చునే వెసులుబాటు ఇవ్వలేదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం చూస్తే... అసలు ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ నియామకమే చట్ట విరుద్ధమన్నారు.

advocat general sriram about nimmagadda ramesh kumar

నిమ్మగడ్డ రమేష్ కుమార్​ నియామకమే తప్పయినప్పుడు, ఆయనను మళ్లీ అదే పోస్టులో నియమించడం ద్వారా ప్రభుత్వం మరో తప్పు చేయాలా..? అని అడ్వకేట్ జనరల్ శ్రీరాం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పష్టత కోసమే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఎస్‌ఈసీ పోస్టులో తనను తాను నియమించుకుంటూ, ప్రభుత్వ అధికారులకు రమేష్‌ కుమార్‌ జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటవ్వవని, వాటిని పాటించాల్సిన అవసరం వారికి లేదని ఆయన స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌తో కలసి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరాం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్​పై హైకోర్టు ఆదేశాల్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఉంటుందన్నారు.

ఆ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా మళ్లీ హైకోర్టులోనే ప్రభుత్వం తరఫున పిటిషన్‌ వేశామని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని ఆయన వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని, తాము కోర్టుల్ని పరిపాలన వ్యవస్థలో భాగంగానే చూస్తామని వారి అభిప్రాయాల్ని, తీర్పుల్ని అనుసరిస్తామని చెప్పారు.

హైకోర్టు కోర్టు తీర్పు శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో వస్తే... తాను ఎస్‌ఈసీగా పునర్నియామకమైనట్లు అదే రోజు మధ్యాహ్నం 3.30కి జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్‌ కమిషర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు తదితరులకు నిమ్మగడ్డ రమేష్ సర్క్యులర్‌ పంపించారని, ఎస్‌ఈసీ పోస్టులో పునర్నియామకమైనట్లు ఆయనంతట ఆయనే ప్రకటించుకున్నారని ఏజీ శ్రీరాం వివరించారు.

తాను పత్రికా ప్రకటన విడుదల చేశానని, అదే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ సర్క్యులర్‌ ఇవ్వాల్సిందిగా ఎస్‌ఈసీ సెక్రటరీని రమేష్‌కుమార్‌ ఆదేశించారని చెప్పారు. అయితే హైకోర్టు తీర్పును పరిశీలిస్తే ఎస్ఈసీగా రమేష్ కుమార్ మళ్లీ నియమించాల్సిదిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిందన్నారు.

ఎస్‌ఈసీగా నియమించేవారి అర్హతల్ని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎస్‌ఈసీ నియామకంపై గవర్నర్‌ తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకునే క్రమంలో... ముఖ్యమంత్రి, మంత్రిమండలి సిఫారసుల మేరకు నడుచుకోకూడదని హైకోర్టు తన తీర్పులో చెప్పిందని ఏజీ పేర్కొన్నారు.

ఒక చట్టానికి సంబంధించి కోర్టు తీర్పు చెప్పినప్పుడు... అది ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ వర్తిసుందని, రమేష్‌కుమార్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 200 ప్రకారమే ఎస్‌ఈసీగా నియమితులయ్యారని, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారిని ఎస్‌ఈసీ పోస్టులో నియమించాలని ఆ సెక్షన్‌ చెబుతోందని అన్నారు.

రమేష్‌ కుమార్‌ని ఎస్‌ఈసీగా నియమించాలని 2015 డిసెంబరు 12న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌కి సిఫారసు చేశారని, సెక్షన్‌ 200 చెల్లదని, ముఖ్యమంత్రి, మంత్రిమండలి సిఫారసుల మేరకు ఎస్‌ఈసీని గవర్నర్‌ నియమించకూడదని హైకోర్టు చెప్పిన తీర్పు... రమేష్‌ కుమార్‌ నియామకానికీ వర్తిస్తుందన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి న్యాయవాది (స్టాండింగ్‌ కౌన్సిల్‌)గా ఉన్న ప్రభాకర్‌ ను రాజీనామా చేయాలని రమేష్‌కుమార్‌ ఆదేశించారని, తనకు కొంత సమయం ఇవ్వమని ప్రభాకర్ కోరినా కుదరదని ఆయన చెప్పిన విషయం గుర్తుచేశారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా రమేష్‌కుమార్‌ని ఎస్‌ఈసీగా పునర్నియమించలేమని, దానిలో రాజ్యాంగపరమైన అంశాలూ ముడిపడి ఉన్నాయని.. దాన్ని సుప్రీంకోర్టు నిర్ణయించాలని ఏజీ అన్నారు. అడ్వకేట్ జనరల్ మీడియా సమావేశానంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన సర్క్యూలర్లు చెల్లవని ఎస్ఈసీ కార్యదర్శి మరో సర్క్యులర్ ఇచ్చారు. రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినట్లు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.

Last Updated : May 31, 2020, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.