ఏలేరు-తాండవ కాలువల అనుసంధాన ప్రాజెక్టు కోసం 470 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం పాలనానుమతులు జారీ చేసింది. గోదావరి డెల్టాలో 51 వేల 465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏలేరు-తాండవ కాలువల అనుసంధానం అవసరమని జలవనరుల శాఖ గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు కాలువల అనుసంధాన ప్రాజెక్టు కోసం 470 కోట్ల రూపాయలను వ్యయం చేసేందుకుగానూ పాలనానుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: కర్నూలు విమానాశ్రయ ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు