ఈఎస్‌ఐ కేసులో అనిశా దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై అనిశా ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. అదనపు సమాచార సేకరణకు అచ్చెన్నాయుడిని కస్టడీకి ఇవ్వాలని అనిశా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా...సమాచారం మొత్తం రిమాండ్ రిపోర్టులోనే ఉందని అచ్చెన్నాయుడి తరఫు న్యాయవాది వాదించారు.
అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి కోరిన పిటిషన్‌పై కూడా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం...బుధవారం తీర్పు వెల్లడించనుంది.
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కేసులో అచ్చెన్నాయుడిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనిశా కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. అరెస్ట్‌కు ముందే అచ్చెన్నాయుడు శస్త్ర చికిత్స చేసుకోవడం.. ప్రయాణంలో గాయం తిరగబెట్టడంతో గుంటూరు జీజీహెచ్‌లో మళ్లీ శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.