14 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న జూనియర్ కళాశాలల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. కళాశాలల్లో సమస్యలను పాలకుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడమే లక్ష్యంగా బంద్ చేస్తున్నట్టు ఏబీవీపీ తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని మొదటి డిమాండ్‌గా చెబుతున్నారు విద్యార్థి నాయకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 3వేలకుపైగా ఉపాధ్యాయ సిబ్బందిని భర్తీ చేయాలని నినదిస్తున్నారు. ఇంచార్జ్ ఆర్ఐఓ వ్యవస్థ తొలగించి శాశ్వత హోదాతో ప్రాతిపదికి నియమించాలని పట్టుబడుతున్నారు. కార్పొరేట్ కళాశాలల్లో జరిగే విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇంటర్మీడియట్ సిలబస్ జాతీయ పరీక్షలకనుగుణంగా ఉండేలా తయారు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లు పరిష్కరించి చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ నెల 5న జూనియర్ కళాశాలలు బంద్.. ఎందుకంటే? - ABVP
మధ్యాహ్న భోజనం నిలిపివేత సహా 14 డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యార్ధి సంఘాలు ఉద్యమబాట పడుతున్నాయి. ఈ నెల ఐదున జూనియర్ కళాశాలల బంద్ పాటించాలని విద్యార్థి లోకాన్ని కోరింది.
14 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న జూనియర్ కళాశాలల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. కళాశాలల్లో సమస్యలను పాలకుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడమే లక్ష్యంగా బంద్ చేస్తున్నట్టు ఏబీవీపీ తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని మొదటి డిమాండ్‌గా చెబుతున్నారు విద్యార్థి నాయకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 3వేలకుపైగా ఉపాధ్యాయ సిబ్బందిని భర్తీ చేయాలని నినదిస్తున్నారు. ఇంచార్జ్ ఆర్ఐఓ వ్యవస్థ తొలగించి శాశ్వత హోదాతో ప్రాతిపదికి నియమించాలని పట్టుబడుతున్నారు. కార్పొరేట్ కళాశాలల్లో జరిగే విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇంటర్మీడియట్ సిలబస్ జాతీయ పరీక్షలకనుగుణంగా ఉండేలా తయారు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లు పరిష్కరించి చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.
Body:ఓవర్
Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి కోడ్ నెంబర్ c1 ap 10146