మీ సేవ కేంద్రాల్లో ఆధార్ సేవలు నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డులో తప్పుల సవరణలు, చిరునామా మార్పులు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యుఐడీఏఐ ఆధ్వర్యంలో రెండులు రోజులు ఆధార్ శిబిరాన్ని విజయవాడలో నిర్వహించారు. ఆధార్ కార్డులో సవరణాలకై శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
మీసేవా కేంద్రాల్లో ఆధార్ సేవల నిలిపివేతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అనుమతులు లభించక ఆధార్ కేంద్రాల నిర్వాహకులు సేవలు నిలిపివేశారన్నారు. తక్షణమే మీ సేవా కేంద్రాల్లో ఆధార్ సేవలను పునరుద్ధరించాలని కోరారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఆధార్ ఫిర్యాదులకై వచ్చామని, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలతో రాలేని వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొదటి నుంచి ఆధార్ లో ఫిర్యాదుల పరిష్కారం కోసం నెలలు తరబడి తిరుగుతున్నా పరిష్కారం అవ్వడంలేదని ప్రభుత్వం దీనిపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఇవీ చూడండి...: హిమాచల్ గవర్నర్ను కలిసిన సీఎం జగన్