కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో వినోద్ అనే యువకుని(లా స్టూడెంట్) కిడ్నాప్ కథ కొత్త మలుపు తిరిగింది. తన భర్త వినోద్‌ను కిడ్నాప్ చేశారని భార్య ప్రశాంతి.. ఈ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. అయితే తాజాగా పోలీసులు వినోద్ విషయంలో వివరణ ఇచ్చారు. ఓ చీటింగ్ కేసులో వినోద్ నిందితునిగా ఉన్నాడని పెనమలూరు పోలీసులు తెలిపారు. ఈ కేసులోనే నెల్లూరు జిల్లా యాదయ్యపాలెం పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: FRAUD: నలుగురితో పెళ్లి.. మరొకరితో వివాహానికి సిద్ధం