- దిల్లీకి ముఖ్యమంత్రి జగన్..!
ముఖ్యమంత్రి జగన్ (cm jagan) ఈ నెల 7న దిల్లీ (delhi tour) వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amith sha)తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ (corona vaccine) సరఫరాతో పాటు వేర్వేరు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నా ఫోన్‌ను దుర్వినియోగం చేశారు: రఘురామ
రాష్ట్ర సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. సునీల్‌కుమార్‌పై దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన రఘురామ.. గత నెల 14న అరెస్టు చేసినప్పుడు తన ఐ-ఫోన్ తీసుకున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నిలకడగా కరోనా కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి 80 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఫలితంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నైరుతి ఆగమనం
నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) వేగంగా పురోగమిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో కోస్తాంద్ర, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆ లక్ష్యం ఐదేళ్ల ముందుకు: మోదీ
2030 నాటికి పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని ఐదేళ్లు ముందుకు జరిపినట్లు తెలిపారు ప్రధాని మోదీ. ఇథనాల్ రంగ అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణ సహా రైతులకు ఆర్థికంగా మేలు చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- లాక్డౌన్ పొడిగింపు- సడలింపు!
జూన్ 14 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు సోమవారం నుంచి ఆంక్షలను సడలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. సడలింపులు పాజిటివిటీ రేట్ మీద ఆధారపడి ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సాంకేతికత బదిలీకి సిద్ధం'
స్పుత్నిక్ టీకా సాంకేతికత బదిలీకి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. విదేశాల్లోనూ టీకా తయారీకి సిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యానేనని ప్రకటించిన ఆయన.. స్పుత్నిక్ సామర్థ్యంపై వస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గ్రీన్ సిగ్నల్!
విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను విక్రయించేందుకు పీఎంఎల్ఏ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పులిచ్చిన బ్యాంకులు తమ రుణాలను వసూలు చేసుకునేందుకు ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులు సహా.. సెక్యూరిటీలను అమ్మేందుకు అనుమతించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'యూఏఈకి తరలించడం ఖాయం'
టీ20 ప్రపంచకప్(T20 World Cup) యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఒప్పుకుందని ఓ బోర్డు (BCCI) అధికారి తెలిపారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'చిరంజీవి కోసం నా దగ్గర భారీ ప్లాన్స్'
చిరుతో సినిమా చేసేందుకు సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 'శాకుంతలం'తో బిజీగా ఉన్న ఆయన.. మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్నారట. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">