ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 9 PM

9pm_Topnews
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Mar 21, 2021, 8:58 PM IST

Updated : Mar 21, 2021, 9:07 PM IST

  • విస్తరిస్తున్న మహమ్మారి

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 368 మందికి కొవిడ్ సోకింది. అత్యధికంగా గుంటూరులో 79, అత్యల్పంగా ప్రకాశంలో ఆరుగురికి వైరస్ నిర్ధరణ అయింది. 263 మంది కోలుకోగా.. ఎవరూ మరణించలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా లెక్కలతో కలిపి ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,93,734కి చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆకలి కేకలు

కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న బాధితుల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చుపెడుతోంది. వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ..క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక్కో కొవిడ్ బాధితుడి ఆహారం కోసం ప్రభుత్వం రూ. 350 కేటాయించినా..వారికి అందుతున్న భోజనం విలువ కనీసం రూ. 60 కూడా ఖరీదు చేయటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తా'

ఉప ఎన్నికల్లో తనని గెలిపిస్తే తిరుపతి వాణిని పార్లమెంట్​లో వినిపిస్తానని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. ఈనెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఎలా సాధ్యం?'

రాష్ట్రంలో ఇసుక నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడం సరైన నిర్ణయం కాదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నిర్ణయంతో సామాన్యుడికి ప్రభుత్వం ఎలా భరోసా కల్పిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మేనిఫెస్టో విడుదల

బంగాల్​లో భాజపా​ మేనిఫెస్టో విడుదల చేశారు ఆ పార్టీ సీనియర్​ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్​ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తొలి కేబినెట్​ సమావేశంలో సీఏఏ అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సంప్రదాయానికి బ్రేక్​

కేరళలో ఎల్​డీఎఫ్​కు ప్రత్యామ్నాయం యూడీఎఫ్​ అనే సంప్రదాయాన్ని బద్దలు కొడతామని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాల్​ కృష్ణ అగర్వాల్​ అన్నారు. ఏప్రిల్​ 6న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. భాజపా నేతృత్వం వహించే ఎన్డీఏ కూటమికి ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'భారత్​లోనే ఉంటాం..సాయం చేయండి'

మయన్మార్‌లో సైన్యం ఆదేశాలను ధిక్కరించి భారత్​కు వచ్చిన ఇద్దరు పోలీస్​ అధికారులు తమకు మానవతా దృక్పథంతో భారత్​లోనే ఆశ్రయం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. మయన్మార్‌లో సాధారణ పౌరులపై చేస్తున్న అరాచకాలను ఒక్కొక్కటిగా వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరింత పారదర్శకం​

ఆరోగ్య బీమా పాలసీల క్లెయిమ్​లలో మరింత పారదర్శకత ఉండాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ) బీమా సంస్థలను ఆదేశించింది. బీమాను తిరస్కరించే సందర్భంలో తగిన కారణాలను వివరించాలని తెలిపింది. క్లెయిమ్ సెటిల్​మెంట్​ సహా.. బీమా ఛార్జీల పెంపు అంశాలపై మరింత అవగాహన కల్పించాలని సూచించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కొత్త రికార్డులు

ఇంగ్లాండ్​తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్​ను 3-2తో కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. పొట్టి ఫార్మాట్​లో పలు రికార్డులు నెలకొల్పింది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. అయితే ఈ సిరీస్​ విజయంతో భారత్ సాధించిన ఘనతలను తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ముద్దుగుమ్మల ముచ్చట్లు

సినీ తారలు తమకు సంబంధించిన కొత్త విశేషాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. వీరిలో ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, రకుల్​ ప్రీత్​ సింగ్​, రణ్​వీర్​ సింగ్​ తదితరులు ఉన్నారు. అవేంటో చూద్దాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Mar 21, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.