- జులై 4న రాష్ట్రానికి ప్రధాని రాక.. చిరుకి ప్రత్యేక ఆహ్వానం
జులై 4న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పంపారు.
- 'ఆరోగ్యశ్రీ బలోపేతానికి చర్యలు తీసుకోండి'
ఆరోగ్య శ్రీలో అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందే దిశగా అడుగులు వేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు.
- భాజపా నేతలపై వైకాపా శ్రేణుల మూకదాడి
సత్యసాయి జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడుపోసుకుంటున్నాయి. ధర్మవరం నడిబొడ్డున సమావేశం జరుగుతుండగా వైకాపా కార్యకర్తలు కర్రలతో మూకుమ్మడిగా వచ్చి భాజపా నేతలపై దాడికి పాల్పడ్డారు.
- హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరిక
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది.ఇవాళ రాత్రి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటికిరావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.
- ముంబయికి 'మహా' రెబల్స్!.. శిందే, ఠాక్రే డైలాగ్ వార్
'మహా వికాస్ అఘాడీ' ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సర్కారు పతనం అంచుకు చేరింది. పొలిటికల్ గేమ్‌లోకి భాజపా ఎంట్రీతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఒకవైపు ఏక్నాథ్ శిందే వర్గంలోని ఎమ్మెల్యేలు శివసేనకు టచ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
- కూలిన నాలుగు అంతస్తుల భవనం.. 18 మంది మృతి
ముంబయిలో సోమవారం రాత్రి కుర్లాలోని ఓ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న 12మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- ఆ దేశాధినేతలకు మోదీ కానుకలివే ఇవే..
జీ-7 శిఖరాగ్ర సదస్సు కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ పర్యటనను చిరస్మరణీయంగా మలుచుకున్నారు. ప్రపంచ దేశాధినేతలకు వివిధ రకాల భారతీయ ఉత్పత్తులను కానుకగా అందించారు.
- జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో పగ్గాలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ముకేశ్.. జూన్ 27న రాజీనామా చేశారని సంస్థ స్టాక్‌మార్కెట్లకు ఇచ్చిన ఫైలింగ్స్‌లో వెల్లడించింది.
- అదరగొట్టిన రాధా యాదవ్.. స్మృతి, హర్మన్ మళ్లీ అదే స్థానాల్లో
మహిళా క్రికెటర్ల తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసీసీ. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ రాధాయాదవ్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి పదమూడో స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై 2-1తేడాతో టీమ్ఇండియా సిరీస్ గెలవడంలో నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించడంతో ఈ ఫీట్‌ను అందుకుంది.
- ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలివే
మాచో స్టార్ గోపీచంద్-రాశీ ఖన్నా జంటగా నటించిన 'పక్కా కమర్షియల్', ఆర్.మాధవన్ తెరకెక్కించిన 'రాకెట్రీ' సినిమాలు ఈ వారమే థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటితో పాటు పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు కూడా థియేటర్, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి.
TOPNEWS: ప్రధాన వార్తలు @9PM - ap 9pm Top news
.
9pm Top news