కృష్ణాజిల్లా విజయవాడ నగరంలోని అయోధ్యనగర్ బుడమేరు కట్టపై కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చి 2 ఆటోలను ఢీకొంది. అనంతరం 13 ఏళ్ల బాలుడిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. బాలుడిని ఢీకొని కారుడ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయారు. ప్రమాదానికి కారుడ్రైవర్ మద్యం మత్తు, నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు దేవీనగర్‌కు చెందిన మణికంఠగా గుర్తించారు.
ఇదీ చదవండీ... 'ఎందుకిలా చిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు'