ETV Bharat / city

CHILD PORNOGRAPHY: చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం.. యువకుడి అరెస్టు - Business with children's blueprints at tirupati

a young man arrest due to business with child pornography videos
చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్న యువకుడి అరెస్టు
author img

By

Published : Nov 17, 2021, 1:58 PM IST

Updated : Nov 17, 2021, 3:31 PM IST

13:56 November 17

చైల్డ్ పోర్నోగ్రఫీ.. తిరుపతిలో యువకుడు అరెస్ట్​

  తిరుపతిలో చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి యశోదనగర్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న మోహన్‌కృష్ణను సీబీఐ పోలీసులు అదుపులోకి(young man mohana krishna arrested for doing business with child pornography videos in Tirupati) తీసుకున్నారు. నగరంలో చిన్న పిల్లలను బలవంతంగా సెక్స్ కార్యకలాపాల్లోకి దింపి.. ఆ క్రమంలో తీసిన అశ్లీల చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాలల్లో పోస్టు చేసి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా చిన్న పిల్లల అసభ్యకర, అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్న, విక్రయిస్తున్న వారిని గుర్తించే లక్ష్యంతో సీబీఐ దాడులు నిర్వహించింది. అందులో భాగంగా తిరుపతిలో మోహన్ కృష్ణ ఇతరులతో కలసి ఈ తరహా వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. సీబీఐ ఎస్పీ సునీల్ సింగ్ రావత్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి అరెస్టు(mohana krishna arrested for doing business with children's blueprints) చేశారు.

నీలిచిత్రాలతో వ్యాపారం 14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు..

ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులు, దోపిడీకి పాల్పడుతున్న వారిపై దేశవ్యాప్తంగా మంగళవారం సీబీఐ దాడులు చేసింది. ఏపీలోని తిరుపతి, అనంతపురం జిల్లా కనేకల్లు సహా 14 రాష్ట్రాల్లోని 77 ప్రదేశాల్లో ఆదివారం సోదాలు నిర్వహించింది. సీబీఐలోని ఆన్‌లైన్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌, ఎక్స్‌ప్లాయిటేషన్‌ ప్రివెన్షన్‌/ ఇన్వెస్టిగేషన్‌ (ఓసీఎస్‌ఏఈ) విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 83 మందిపై 23 కేసులు నమోదు చేసింది. ఈ దందాలో(Business with children's blueprints) దేశ, విదేశాల్లోని పలు ముఠాలు, సంస్థల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. సుమారు 5 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోలు, రాతలను పంచుకుంటున్నారు. సోదాల్లో ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైళ్లు, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలోని యశోదనగర్‌కు చెందిన టి.మోహన్‌కృష్ణపై ఐపీసీ 120బీ, ఐటీ చట్టంలోని 67బీ ప్రకారం కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా మోహన్‌కృష్ణ చర్యలను ఆన్‌లైన్‌లో పసిగట్టిన పోలీసులు.. చిత్తూరు జిల్లా సీబీఐ ఎస్పీ సునీల్‌సింగ్‌ రావత్‌తో ప్రాథమికంగా విచారణ చేయించారు.

ఇదీ చదవండి:

 రాష్ట్రానికి పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధుల బృందం..జెన్‌కోకు ఇచ్చిన రుణ బకాయిలపై సీఎస్‌తో చర్చ !

Last Updated : Nov 17, 2021, 3:31 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.