చిత్తూరు జిల్లా వైకాపా శాసనసభ్యులు తిరుపతిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అవలంబిచాల్సిన విధానాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించారు. అనంతరం వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.
జనవరి 6 నుంచి ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రారంభిస్తామన్న ఆయన.. ఎంపీ అభ్యర్థిని సీఎం జగన్ ప్రకటిస్తారన్నారు. సంక్షేమ పథకాలే అజెండాగా ప్రజల్లోకి వెళ్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి