ETV Bharat / city

Women death: పాపం పసివాడు.. నాలుగు రోజులుగా అమ్మ మృతదేహంతోనే..!

Women death: రోజు ఉదయాన్నే నిద్రలేచే తన తల్లి.. నాలుగు రోజులుగా అలాగే నిద్రిస్తున్నా.. ఏమైందో ఆ బాలుడికి అర్థంకాలేదు. అమ్మ నిద్రిస్తుందనుకుని భావించి.. తానే రోజు స్కూలుకు వెళ్లివస్తున్నాడు. ఇంట్లో ఉన్న తినుబండారాలతో నాలుగు రోజులు గడిపాడు. తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలియక.. ఆమె పక్కనే నిద్రిస్తున్నాడు. అయితే.. ఇంట్లో ఏదో కుళ్లిపోయిన వాసన వస్తోందని.. బాలుడు మేనమామకు ఫోన్ చేసి రమ్మనాడు. ఆయనొచ్చి అమ్మ చనిపోయిందని చెబితే కానీ అసలు విషయం తెలుసుకోలేని పరిస్థితి ఆ పిల్లాడిది. ఈ విషాదకర ఘటన.. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Women suspicious death in chittor
పాపం పసివాడు.. నాలుగు రోజులుగా అమ్మ మృతదేహాంతోనే..!
author img

By

Published : Mar 12, 2022, 9:09 AM IST

Updated : Mar 13, 2022, 4:48 AM IST

Women death: తిరుపతి విద్యానగర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో రాజ్యలక్ష్మి (41), తన పదేళ్ల కుమారుడు శ్యామ్‌కిశోర్‌తో కలిసి రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఆమె ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలు. కుమారుడు ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. భర్త శ్రీధర్‌రెడ్డి అధ్యాపకుడు. ఆయనతో భేదాభిప్రాయాలు రావడంతో రాజ్యలక్ష్మి వేరుగా జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆమె తలనొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె పట్టా అందుకోవడానికి కర్ణాటక రాష్ట్రంలోని బెలగావికి బయలుదేరడానికి ఈ నెల 9న ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోనే ఉంటున్న తన తమ్ముడు దుర్గాప్రసాద్‌తో ముందు రోజు మాట్లాడి విషయం చెప్పారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని, అప్పటికీ తలనొప్పి తగ్గకపోతే చికిత్స చేయించుకుంటానని ఆయనకు తెలిపారు.

.

అదే రోజు రాత్రి రాజ్యలక్ష్మి మంచంపై నుంచి బోర్లాపడి అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మ నిద్రపోతోందని కుమారుడు శ్యామ్‌కిశోర్‌ భావించాడు. ఆమెను నిద్ర లేపకూడదనుకున్నాడు. రెండు రోజులపాటు ఇంట్లో ఉన్న తినుబండారాలతో ఆకలి తీర్చుకున్నాడు. మూడోరోజు అన్నం, టమాటా కూర చేసుకున్నాడు. మూడు రోజులూ బడికి వెళ్లొచ్చాడు. అప్పటికీ రాజ్యలక్ష్మిని లేపలేదు. నాలుగోరోజు మేనమామకు ఫోన్‌చేసి ఇంట్లో దుర్వాసన వస్తోందని, నిద్రపోతున్న అమ్మకు ఆపరేషన్‌ చేయాలని చెప్పాడు. హుటాహుటిన ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్‌ అసలు విషయం గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తన మేనల్లుడి మానసిక ఆరోగ్యం సరిగాలేదని దుర్గాప్రసాద్‌ చెప్పారు.

ఇదీ చదవండి: కుళ్లిన కోడిగుడ్లు తిని 11 మంది విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Mar 13, 2022, 4:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.