ETV Bharat / city

వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్నాడు... కూలీగా మారాడు

వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్నాడు ఆ యువకుడు. 180 కేజీల బరువును అలవోకగా ఎత్తేయగలడు. ఇప్పటికే జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీల్లో 44 పతకాలు కూడా సాధించాడు.  జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక మట్టిలో మాణిక్యంలా మిగిలిపోయాడు. కూలి పనులు చేస్తూ తనలాంటి మరికొందరికి శిక్షణ ఇస్తున్నాడు.

author img

By

Published : Jun 21, 2019, 8:19 AM IST

వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్నాడు... కూలీగా మారాడు

చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కుమార్​ చిన్నతనం నుంచే వెయిట్ లిఫ్టింగ్​పై ఆసక్తి పెంచుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది అతని కోరిక. లక్ష్యమైతే నిర్దేశించుకున్నాడు కానీ తన ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే. ఆటో డ్రైవర్​ అయిన తన తండ్రి సుబ్రహ్మణ్యానికి వచ్చే ఆదాయంతోనే ఇల్లు గడవాల్సిన పరిస్థితి. కష్టాలు వెంటాడుతున్నప్పటికీ అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు. పాతికేళ్ల వయస్సు వచ్చేప్పటికి 110 కిలోల బరువు ఎత్తేలా రాటు దేలాడు. కుమారుడిని ప్రోత్సహించేందుకు అతని తల్లి బంగారు గొలుసును అమ్మి జిమ్ పరికరాలను సమకూర్చింది. వాటితోనే ప్రాక్టీస్ చేసిన కుమార్.. 180 కేజీల బరువు ఎత్తే స్థాయికి చేరుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని ఇప్పటి వరకూ 44 పతకాలు గెల్చుకున్నాడు.

కూలీగా విధులు
అయితే చిత్తూరు జిల్లాలో పవర్ లిఫ్టింగ్ కంటూ ప్రత్యేకంగా వసతులు లేకపోవటం... గుంటూరు, విజయవాడ వంటి ప్రదేశాలకు వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవటంతో కుమార్ కేవలం రాష్ట్రానికి పరిమితమైపోయాడు. బాడీ బిల్డింగ్ పైనా దృష్టి సారించిన కుమార్... రాష్ట్రస్థాయి వేదికల్లో బహుమతులు సాధించాడు. ఎన్ని చేసిన తనలోని వెయిట్ లిఫ్టర్​కి ఇవి సాయం చేయలేకపోయాయి. చివరికి తండ్రి కష్టంపైన ఆధారపడకూడదని తితిదేలో యాత్రికుల బ్యాగులను వాహనాల్లోకి చేరవేసే కూలీగా ఉద్యోగంలోకి చేరాడు. తనకి వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే మరో 14 మంది కుర్రాళ్లకు వెయిట్ లిఫ్టింగ్​లో శిక్షణ ఇస్తున్నాడు.

సాయం కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం కుమార్ వయస్సు దాదాపు 35 సంవత్సరాలు.. అయినా అతనికి జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించాలన్న కోరిక పోలేదు. ఇప్పటికీ 180కేజీలు ఎత్తుతున్న కుమార్... 200కిలోల పైన ఎత్తగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లవచ్చని చెబుతున్నాడు. సరైన డైట్, ప్రొటీన్లతో కూడిన ఆహారం, వెయిట్ లిఫ్టింగ్ కోసం సామాగ్రి వంటి వాటి విషయంలో ప్రభుత్వం సాయం కోరుతున్నాడు.

Intro: ap_gnt_51_20_mahilapi_dadi_c16
పాత కక్షల నేపథ్యంలో మహిళపై కత్తితో దాడి చేసి ఇ గాయపరిచిన ఘటన పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది బాధితురాలు బుర్ర మేరీ వర్జీనియా మేరకు

Body:తన బా వా బుర్ర శ్రీనివాస్ అతని కుమారుడు ప్రశాంత్ తెలుగుదేశం పార్టీలో తిరుగుతుంటారని ని ఈ నేపథ్యంలో పాతకక్షలు మనస్సులో పెట్టుకుని గ్రామానికి చెందిన చైతన్య షడ్రక్ మరి కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి తన ఇంటి వద్ద తన భర్త కోసం వెతుకుతుండగా గమనించిన న మీరు ఎవరు ఎందుకు వచ్చారు అంటూ వారు ఇస్తుండగా నీ భర్తను చంపేందుకు వచ్చామని అతను ఎక్కడ ఉన్నాడు అంటూ బెదిరించారు రు వచ్చిన మరో గుర్తు తెలియని వ్యక్తి తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశారు

Conclusion:గాయపడిన ఆమె పొన్నూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పరామర్శించారు

రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.