స్మార్ట్ సిటీ పథకం కింద తిరుపతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని వినాయక్ సాగర్ వద్ద తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషాతో కలిసి ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా స్మార్ట్ సిటీ కింద చేపడుతున్న పనులను ఎమ్మెల్యేకి కమిషనర్ గిరీషా వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.... ఆధ్యాత్మిక నగరి తిరుపతిని స్మార్ట్ సిటీ కింద సుందరంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.
మరోవైపు కొవిడ్ కారణంగా నెమ్మదించిన అభివృద్ధి పనులను ఇకపై వేగవంతంగా పూర్తి చేసి తిరుపతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ గిరీషా తెలిపారు. 14 కోట్ల 97 లక్షల రూపాయల వ్యయంతో ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కడప కలెక్టర్ హరికిరణ్కు కరోనా పాజిటివ్