ETV Bharat / city

విశాఖ - చెన్నై నడవా: చిత్తూరులో భూసేకరణ వేగవంతం - tirupathi news

విశాఖ- చెన్నై పారిశ్రామిక నడవా అభివృద్ధి కోసం పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో భూ సేకరణ ప్రక్రియ వేగవంతమైంది. గతంతో పోల్చితే భూసేకరణ ప్రక్రియకు అవాంతరాలు ఎదురుకాకుండా రెవెన్యూ అధికారులు సులభతర ప్రక్రియలను అవలంబిస్తున్నారు. జిల్లాలోని మూడు మండలాల పరిధిలో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా.....ఏపీఐఐసీ కోరిన చోట్ల స్టార్టప్ ప్రాంతాలుగా గుర్తించి భూములను అందించే విధంగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు..

Tirupati rdo Kanakanarasareddy
తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి
author img

By

Published : Oct 7, 2020, 3:25 PM IST

Updated : Oct 7, 2020, 4:21 PM IST

తీరప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్​గా తీర్చిదిద్దే ప్రక్రియలో రాష్ట్రంలో కీలకమైన విశాఖ - చెన్నై పారిశ్రామిక నడవాకు సంబంధించిన పనులు జోరందుకున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సరికొత్త ప్రణాళికలను అవలంబిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా చిత్తూరు జిల్లాలో 24వేల ఎకరాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలు అందగా.... శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ మండలాల్లో ఇప్పటికే 11 వేల ఎకరాలకు సంబంధించి ఫీల్డ్ సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయటంలో భాగంగా గతంలో అనుసరించిన ప్రణాళికలకు భిన్నంగా సరికొత్త మార్గాలను రెవెన్యూ అధికారులు అవలంభిస్తున్నారు.

  • భూసేకరణ ముమ్మరం

గతంలో భూ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాతే ఏపీఐఐసీకి రెవెన్యూ అధికారులు భూములను అప్పగించేవారు. ఈ విధానం ద్వారా పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ఈ సారి ప్రత్యేక విధానాలను అవలంబిస్తున్నారు. ఏపీఐఐసీ ఎక్కడ కోరితే అక్కడ... ఆ ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో భూములను సేకరించి వారికి అందించేలా చర్యలు చేపట్టారు. వీటిని స్టార్టప్ ప్రాంతాలుగా గుర్తించి.... అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. అలా ఇప్పటికే తొలివిడతలో మూడు మండలాల్లో 2వేల150 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఏపీఐఐసీకి అధికారులు అప్పగించారు. ఇప్పుడు మరో 1,350 ఎకరాలు అప్పగించాలని ఏపీఐఐసీ చేసిన విన్నపం మేరకు....క్షేత్ర స్థాయిలో భూ సేకరణను పనులను వేగవంతం చేసినట్లు రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు.

ఈ తరహా ప్రక్రియను అవలంబించటం ద్వారా మరో 4-5 రోజుల్లో రికార్డుల పరిశీలన పూర్తి చేసి ఏపీఐఐసీకి భూములను అప్పగించేలా రెవెన్యూ అధికారులు ప్రణాళికలను రచిస్తున్నారు. తద్వారా పారిశ్రామిక నడవాలో...చిత్తూరు జిల్లాకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తూ....పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్‌ప్లాంట్లతో రైతన్నకు లాభం

Last Updated : Oct 7, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.