తిరుమల శ్రీవారిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషకరమని కరణం మల్లీశ్వరి అన్నారు.
నిన్న శ్రీవారిని 29,652 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు.
ఇదీ చదవండి: