శ్రీవారి దర్శనార్థం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం తిరుపతికి వచ్చిన ఉప రాష్ట్రపతి పలు కార్యక్రమాలలో పాల్గొని కొండపైకి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి.. ఈ ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామివారిని శ్రీవారిని దర్శించుకోనున్నారు.
విదేశాలకు వెళ్లండి.. ఉన్నత చదువులు చదివి, ఆర్థికంగా బలపడ్డాక స్వదేశానికి వచ్చి మాతృదేశానికి సేవలందించాలంటూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో అమరరాజా గ్రూపు నిర్మించిన అమర ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. పాల్గొన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్రనాయుడు.. స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి దేశానికి సేవ చేస్తున్నారు. స్వదేశానికి విచ్చేసిన వేల మందికి ఉపాధి కల్పించే స్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా మార్గదర్శకంగా నిలిచారు. మాతృదేశం, మాతృభాష, మాతృమూర్తిని మరవకూడదు. అమర ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రికి వచ్చే వారు ఆరోగ్యంగా, సంతోషంగా తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాను. కొవిడ్ సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్లు, నర్సులకు అభినందనలు
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఇదీ చదవండీ.. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు