ETV Bharat / city

Southern Zonal Council Meet: అమిత్ షా తిరుపతి పర్యటన.. సీఎం జగన్​తో కలిసి శ్రీవారి దర్శనం - సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా
author img

By

Published : Nov 13, 2021, 8:47 PM IST

Updated : Nov 13, 2021, 10:51 PM IST

20:41 November 13

ఆదివారం సదరన్‌ జోనల్‌ భేటీలో పాల్గొననున్న అమిత్‌ షా

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా..ముఖ్యమంత్రి జగన్​తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు విచ్చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్​కు ఆలయ ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు.  

మూడు రోజుల పర్యటనలో భాగంగా.. కేంద్రమంత్రి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు(Union Minister Amit Shah reached tirupati news). ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌  శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమల కొండకు చేరుకున్నారు. 

రేపు స్వర్ణభారతి ట్రస్టుకు అమిత్ షా..

తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుని అక్కడే బస చేయనున్న అమిత్ షా..  ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ లో నెల్లూరుకు బయల్దేరనున్నారు.  వెంకటాచలంలోని అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు. అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం(Southern Zonal Council Meet news)లో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్‌ హోటల్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40కు దిల్లీ చేరుకుంటారు.

ఇదీ చదవండి

Southern Zonal Council: రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ.. ఏపీ అజెండా ఏంటంటే!

Last Updated : Nov 13, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.