తిరుమలలో మంగళవారం రెండు చోట్ల పాములు కలకలం రేపాయి. స్వామివారి ఆలయ సమీపంలోని కల్యాణవేదిక వద్ద నాగపాము ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది.. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడుకు సమాచారమిచ్చారు.
ఆయన వచ్చి చాకచక్యంగా పట్టుకున్నారు. మ్యూజియం సమీపంలో మరో జెర్రిపోతు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి దాన్నీ బంధించారు. పట్టుకున్న పాములను శేషాచలం అటవీ ప్రాంతంలోని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.
ఇదీ చదవండి: