చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న శ్రీ సిటీని నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ (NUDA) పరిధి నుంచి తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (TUDA) పరిధిలోకి చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతూ తిరుపతి నగరాభివృద్ధి సంస్థ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది.
తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధ్యక్షతన తుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకొన్నారు. తిరుపతి నగరంలోని స్విమ్స్, రుయా ఆసుపత్రుల ఆవరణలో రోగుల సహాయకులు వేచి ఉండటానికి మౌలిక వసతులతో కూడిన షెడ్లు నిర్మించడానికి సమావేశంలో తీర్మానం చేశారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలోని సూరప్పకశం గ్రామంలోని 145 ఎకరాల తుడా భూమిలో టౌన్‌షిప్ నిర్మించనున్నారు. తుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి పారదర్శకంగా చేస్తామని...భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టే సమయంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకొంటామన్నారు. తిరుపతి విమానాశ్రయ అథారిటీతో పాటు తితిదే ఇతర సంస్థలు తమ బకాయిలు వెంటనే చెల్లించేలా నోటీసులు జారీచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
ఇదీ చదవండీ :