తితిదే నూతన ఈవో కేఎస్ జవహర్ రెడ్డి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈవోగా శ్రీవారి ఆలయంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ఆయన... అనంతరం కుటుంబ సమేతంగా తిరుచానూరు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
నూతన ఈవోకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తితిదే జేఈవో బసంత్ కుమార్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియా మాట్లాడిన జవహర్ రెడ్డి... తితిదే ఈవోగా పనిచేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: