తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది ఆస్థానంను నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది. ఆ రోజున తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి.. అనంతరం శుద్ది చేయనున్నారు. ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేయనున్నారు. ఆ తరువాత 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి వేంచేయనున్నారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేసి పంచాగ శ్రవణం చేయనున్నారు. ఉగాది ఆస్థానం కారణంగా ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఇతర కార్యక్రమాలను తితిదే రద్దు చేసింది.
ఇదీ చదవండీ.. శ్రీవారి సేవలో తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ