తిరుమల గిరుల్లోని ఆంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని నిరూపించడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు సేకరించడానికి ఆరుగురు పండితులతో తితిదే కమిటి ఏర్పాటు చేసింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు జె.రామక్రిష్ణ, శంకరనారాయణ, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈఓ జవహర్ రెడ్డి తితిదే పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేసుకొంటున్నాయని ఈ నేపథ్యంలో పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్ఠితో ఆంజనేయస్వామి తిరుమలలో జన్మించారని ఆధారాలతో నిరూపించటానికి అవసరమైన పరిశోధనలు చేయాలని పండితులను కోరారు.
పురాణాల ఆధారంగా తిరుమల ఆంజనేయస్వామివారి జన్మ స్థలమని పండితులు ఈవో దృష్ఠికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఈఓ....ఆంజనేయస్వామి జన్మస్థలం తిరుమల అని నిరూపించడానికి తగిన సమాచారం సిద్ధం చేయవలసిందిగా ఆయన పండితులను కోరారు.
ఇదీ చదవండి: