ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​.. శ్రీవారి భక్తులూ ఇవి పాటించండి..! - ttd test devotees through thermal guns due to corona virus news

కోనేటి రాయుడి క్షేత్రమైన తిరుమలలో కరోనా వైరస్​ నిరోధానికి తితిదే చర్యలు ప్రారంభించింది. భక్తులు వచ్చే మార్గాల్లో థర్మల్​ గన్​ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. అలాగే తిరుమలకు రాలేని భక్తులు టికెట్లు రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు మెయిల్​ ద్వారా సంప్రదించాలని కోరింది.

కరోనా ఎఫెక్ట్​.. శ్రీవారి భక్తులూ ఇవి పాటించండి..!

author img

By

Published : Mar 12, 2020, 9:27 PM IST

కరోనా వైరస్​పై శ్రీవారి భక్తులకు తితిదే సూచనలు

తిరుమలలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా తితిదే అన్ని చర్యలు చేపట్టింది. కరోనా భయంతో తిరుమలకు రాలేని భక్తుల దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, గదులు రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టికెట్లు రద్దు చేసుకోవాలనుకునేవారు dyeotemple@gmail.com మెయిల్​ ద్వారా తమను సంప్రదించాలని అధికారులు కోరారు.

థర్మల్​ గన్​ ద్వారా పరీక్షలు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను థర్మల్​ గన్​ ద్వారా అధికారులు పరీక్షించనున్నారు. ఇందుకోసం అలపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో ఉన్న వారు తిరుమలకు రావద్దంటూ తితిదే భక్తులకు విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్​పై వీడియోల ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లో భక్తులకు తితిదే సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి:

అభ్యర్థులను బెదిరిస్తే.. ఊరుకోం: రమేశ్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.