తిరుపతి మున్సిపల్ పార్క్ వద్ద జరుగుతున్న గరుడవారధి పనులను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఫ్లైఓవర్ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్లేవారు నేరుగా అలిపిరికి చేరుకుని.. తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: TTD: 'గోవిందానంద సరస్వతికి సంస్కృతంలో పరిజ్ఞానమే లేదు'