ETV Bharat / city

తిరుమలలో పలు ప్రాంతాలను పరిశీలించిన తితిదే చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి - చిత్తూరు తాజా న్యూస్

తిరుమలలోని పలు ప్రాంతాలను ఆలయ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అన్నప్రసాద భవనానికి చేరుకున్న ఆయన.. కొంత సమయం భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. అనంతరం అక్కడి సమస్యలు, వసతులు, పలు అంశాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన ఓ భక్తుడు.. తితిదేకు రెండు టన్నుల ఊరగాయలను విరాళంగా ఇచ్చారు.

ttd chairman inspection in tirumala tirupati dhevasthanam in tirupati
తితిదేలోని పలు ప్రాంతాలను పరిశీలించిన ఆలయ ఛైర్మన్
author img

By

Published : Feb 5, 2021, 9:50 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు ప్రాంతాలను ఆలయ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ముందుగా అన్నప్రసాద భవనానికి చేరుకున్న ఆయన.. కొంతసేపు భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. భక్తులతో మమేకమై వారి నుంచి పలు అంశాలను ఆరా తీశారు. శ్రీవారి దర్శనం, వసతి గదులు అందుతున్న తీరు, శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల రుచి, నాణ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భక్తులతో కలసి భోజనం చేశారు.

అనంతరం లడ్డూ వితరణ కేంద్రంను.. బూందీ తయారీ నూతన పోటును తితిదే ఛైర్మన్ పరిశీలించారు. థర్మోప్లూయిడ్‌ పొయ్యిలతో ఏర్పాటు చేసిన పోటుకు.. ట్రయల్‌ రన్‌ నిర్వహించామని..త్వరలోనే పోటును ప్రారంభిచనున్నట్లు తెలిపారు. దీనిద్వారా అగ్నిప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నారు.

తితిదేకు రెండు టన్నుల ఊరగాయల బహుకరణ..

తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు టన్నుల ఊరగాయలను ఓ భక్తుడు బహుకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన కాటూరి రాము అనే భక్తుడు.. వివిధ రకాల ఊరగాయలను తితిదేకు విరాళంగా ఇచ్చారు.

ఈ సందర్భంగా వీటిని అన్నదానం భవనంలో ఆలయ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. స్వామివారి అన్న ప్రసాదంలో వీటిని భక్తులకు అందించాలని దాత కోరారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.