అమరావతిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడంపై వస్తున్న వివాదం మీద.. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఆరుగురు ఉద్యోగులతో పాటు మౌలిక వసతులతో కూడిన క్యాంపు కార్యాలయాన్ని తాడేపల్లెలో ఏర్పాటు చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం తితిదే ఉత్తర్వులు వెలువరించడంపై.. తనకేమీ తెలియదన్నారు.ఈ ఉత్తర్వులు ఎలా వెలువడ్డాయన్న విషయంపై.. విచారణ నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారి నిధులను దుర్వినియోగం చేయబోమని... తన వ్యక్తిగత అవసరాలకు సొంత డబ్బే వినియోగిస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి... నేటినుంచి ఎల్-1, ఎల్-2, ఎల్-3 దర్శనాలు రద్దు: తితిదే ఛైర్మన్