తిరుమలలోని అన్నమయ్య భవన్ లో.... తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమైంది. 2020-21 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించడం సహా వాటికి ఆమోదముద్ర వేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ 3 వేల 243 కోట్ల రూపాయలు కాగా... వచ్చే ఏడాదికి 3వేల 500 కోట్ల రూపాయలకు పెంచనున్నారు. వివిధ శాఖలకు కేటాయించే నిధులను కుదింపు.... అనవసర వ్యయాన్ని తగ్గించుకోవడం, నిధుల సమీకరణపై దృష్టి సారించిన ధర్మకర్తల మండలి అందుకు తగిన రీతిలో కసరత్తు చేసింది.
దేవస్థానం పరిధిలోని ఇతర ఆలయాలు, విద్య, వైద్య సంస్థల్లో అత్యవసరాల మేరకు డబ్బు ఖర్చుచేయాలన్న నిర్ణయానికి వచ్చిన మండలి... అందుకు తగిన రీతిలో బడ్జెట్ అంచనాలను రూపొందించింది. అద్దె గదుల కిరాయి, అలిపిరి టోల్ గేట్ రుసుం పెంచడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. మొత్తం 150 అంశాలు నేటి సమావేశ అజెండాలో ఉన్నాయి.
ఇవీ చదవండి: