అర్చకులందరూ కోలుకున్నారనుకునే సమయంలో శ్రీనివాసాచార్యులు కరోనాతో మృతి చెందడం వారిని కలవరానికి గురిచేసింది. శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు తిరుపతి కోదండరామస్వామి ఆలయం నుంచి ఎన్వీ శ్రీనివాసాచర్యులు డిప్యుటేషన్‌పై తిరుమలకు వచ్చారు. అయితే ఆయనకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స కోసం పద్మావతి కొవిడ్ అసుపత్రికి తరలించగా అయితే కార్డియాక్ అరెస్టు కావడంతో వైద్యులు సీపీఆర్ వైద్యం చేసేందుకు ప్రయత్నించారు. శరీరం సహకరించక పోవడంతో గురువారం సాయంత్రం 4 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపినట్లు తితిదే ప్రకటించింది.
అర్చకుల్లో తొలి కరోనా మరణం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోమారు సమావేశమయ్యారు. ఈనెల 31వ తేది వరకు కళ్యాణోత్సవ సేవను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఆసుపత్రుల అమానుషత్వం.. కొవిడ్‌పై పోరులో గెలుపెలా?